Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాబోయే రెండేళ్ల వరకు నీటి సమస్య ఉండదు: సీఎం కేసీఆర్

తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ ఇప్ప‌టివ‌ర‌కు అంత‌గా ప్రాణ‌, ఆస్తిన‌ష్టం జ‌ర‌గ‌లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న ఆయన వ‌ర‌ద, ప్రాజెక్టుల ప‌రిస్థితులపై మంత్రులు, అధికారుల‌తో ఆయన స‌మీక్ష జ‌రిపారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేసీఆర్ మాట్లాడారు. రాబోయే రెండేళ్ల వరకు నీటి సమస్య ఉండదని ఆయ‌న చెప్పారు. అతివృష్టి వ‌చ్చినా ప్ర‌మాదాలు జ‌ర‌గ‌లేదని అన్నారు. ఈ ఏడాది ర‌బీసాగుకు ఢోకా లేదని ఆయ‌న పేర్కొన్నారు. ఖ‌రీఫ్ పంట‌కు కొంత న‌ష్టం జ‌రిగిన‌ప్ప‌టికీ ర‌బీకి మంచి అవ‌కాశం ఉందని చెప్పారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కాంట్రాక్ట‌రును తొల‌గిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. మ‌రికొన్ని చోట్ల ఇప్పుడున్న కాంట్రాక్ట‌ర్ల‌ను తొల‌గించి కొత్త‌వారికి ఆయా ప‌నులు ఇస్తామ‌ని చెప్పారు. ఎల్ఎండీ మ‌రో మూడు టీఎంసీలు నిండాల్సి ఉందని ఆయ‌న అన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయని చెప్పారు. జూరాల నిండిపోయి శ్రీ‌శైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద వ‌స్తోందని చెప్పారు. ఆల్మ‌ట్టి, నారాయ‌ణ‌పూర్ జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద కూడా వ‌స్తోందని అన్నారు. గోదావరి బేసిన్ ప్రాజెక్టులు నిండడం ఆనందం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. పున‌రావాస కేంద్రాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు భోజ‌న స‌దుపాయం క‌ల్పించిన‌ట్లు చెప్పారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్టపోయిన కుటుంబాల‌కు ప‌రిహారం ఇస్తామ‌ని అన్నారు.

More Telugu News